e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి

మహబూబ్‌నగర్‌ : పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు. నవాబ్ పేట మండలం, తీగలపల్లి, కాకర్ల పాడు గ్రామాల్లో పల్లె ప్రగతి కింద చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. అలాగే హరితహారంలో భాగంగా ప్రజలకు 6 మొక్కలను పంపిణీ చేశారు. పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, హరితహారం కోసం నిర్వహిస్తున్న నర్సరీ, చెత్తను వేరు చేసే చెత్త సేకరణ షెడ్డు అన్నీ చక్కగా నిర్వహిస్తున్నారని కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.


చెత్తను వేరు చేసే షెడ్డు ను తనిఖీ చేశారు. ఎప్పటి నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు, ఎంత సమయం పడుతున్నదని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టే కార్యక్రమాలతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. ఇప్పటివరకు 279 గ్రామ పంచాయతీలలో గ్రామకంఠం సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వెంకట్రావు వివరించారు. గ్రామంలో పల్లె ప్రగతి, పారిశుద్ధ్య కార్యక్రమం సర్వే సందర్భంగా చేపట్టిన పనుల వివరాలను పంచాయతీ కార్యదర్శి ద్వారా అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పంవార్, డీఆర్డీవో యాదయ్య, జెడ్పీ సీఈవో జ్యోతి, డీపీవో వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి, డీసీవో సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, ఆత్మ పీడీ హుఖ్య నాయక్, తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్‌!

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్

ఒలింపిక్స్‌కు భారీ టీమ్‌ను పంప‌నున్న చైనా

వెదజల్లే పద్ధతితో అధిక దిగుబ‌డి : మంత్రి అల్లోల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana