శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:43:57

కరోనా నియంత్రణకు ‘ఫెవిపిరవిర్‌'

కరోనా నియంత్రణకు ‘ఫెవిపిరవిర్‌'

  • గొంతు సమస్యలు తగ్గించడంలో కీలకం
  • ప్రపంచ దేశాలకు హైదరాబాద్‌ ఆప్టిమస్‌ ఫార్మా కంపెనీ ఎగుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ కీలక ఔషధ గుళికలను ఎగుమతి చేస్తున్నది. ఫెవిపిరవిర్‌ అనే ఈ ట్యాబ్లెట్లు కరోనా నియంత్రణలో కీలకంగా పనిచేస్తున్నాయట. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఆప్టిమస్‌ ఫార్మా కంపెనీ ఈ ట్యాబ్లెట్‌ను ప్రపంచ దేశాలకు అందిస్తున్నది. చైనా , జపాన్‌, రష్యా, యూఏఈ తదితర దేశాల్లో వీటిని వినియోగించగా ఫలితం రావడంతో పలు దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కొవిడ్‌-19లో గొంతు సమస్యలను తగ్గించడంలో ఈ ట్యాబ్లెట్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 4 నుంచి 14 రోజుల వ్యవధిలో దీని ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆప్టిమస్‌ ఫార్మా కంపెనీ అత్యధికంగా 5లక్షల ట్యాబ్లెట్‌ను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.

రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలకు ఎగుమతి చేయడానికి ఆర్డర్లు వచ్చినట్లుగా సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫెవిపిరవిర్‌ ట్యాబ్లెట్‌ను 200ఎంజీ, 400ఎంజీల్లో తయారు చేస్తున్నారు. ఆప్టిమస్‌ కంపెనీ తయారు చేసిన అనేక ఉత్పత్తులకు యూఎస్‌ఎఫ్‌డీఏ, ఈయూజీఎంపీ, డబ్ల్యూహెచ్‌వోఎంపీ, టీజీఏ అనుమతులున్నాయి. కరోనా పోరులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. 


logo