శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 14:15:55

ఈ నెల 13 నుంచి 19 వరకు అలంపూర్ ఆలయం మూసివేత

ఈ నెల 13 నుంచి 19 వరకు  అలంపూర్ ఆలయం మూసివేత

జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోలని అలంపూర్‌లోగల జోగులాంబ, బాలబ్రహేంద్ర స్వామి ఆలయాన్ని ఈ నెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు.  ఆలయ సమీపంలో ఉన్న దర్గా ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో ఆలయాన్ని వారంపాటు మూసివేసి, దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా, జోగులాంబ, బాలబ్రహేంద్రస్వామివార్లకు త్రికాల పూజలు యధావిధిగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo