గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 19:42:49

స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

   స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ తెలంగాణ మిషన్ లో భాగంగా.. స్వచ్ఛ మున్సిపాలిటీలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో అవసరమైన అన్ని చోట పబ్లిక్ టాయిలెట్స్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించిన స్వచ్ఛ భారత్,స్వచ్ఛ తెలంగాణ లో భాగంగా రూ.10 లక్షలతో ఇక్సోరా  (IXORA FM) సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన అధునాతన కేఫ్ కం టాయిలెట్స్ ను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఆగష్టు 15వ తేదీలోగా ఈ టాయిలెట్స్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.


logo