మంగళవారం 26 మే 2020
Telangana - May 07, 2020 , 14:53:18

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అల్లోల

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అల్లోల

హైదరాబాద్‌ : రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.నిర్మల్ పట్టణం సిద్ధాపూర్ లో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు రైతు బీమా పథకాలను అమలు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉండవని అన్నారు. నిర్మల్ పట్టణంలో ఐదు ట్యాంకులను నిర్మించేందుకు రూ. 42 కోట్లు మంజూరయ్యాయ మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్క్ లను ధరించి, సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు


logo