మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:47:25

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం

  • కేంద్ర హోంశాఖ సీనియర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ విజయ్‌కుమార్‌

ములుగు, నమస్తే తెలంగాణ: మావోయిస్టులను సంఘటితంగా ఏరివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సీనియర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ కే విజయ్‌కుమార్‌ పోలీసు అధికారులకు సూచించినట్టు సమాచారం. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు)లో కేంద్ర భద్రతా ఉన్నతాధికారులు అంతర్రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించా రు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో ఇటీవల మావోయిస్టుల దురాగతాలు పెరిగిపోయాయని, వారి కట్టడికి సమన్వయంతో పనిచేయాలని స మావేశంలో సూచించినట్టు తెలిసింది. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా  కూంబింగ్‌, నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. సమావేశంలో సీఆర్పీఎఫ్‌ డీజీ మహేశ్వరి, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ డీజీ అశోక్‌జునేజా, ఛత్తీస్‌గఢ్‌ డీఐజీ (ఆపరేషన్స్‌) సీఆర్పీఎఫ్‌ ప్రకాశ్‌, బస్తర్‌ రేంజ్‌ డీజీ సుందర్‌రాజ్‌,  కొత్తగూడెం, ములుగు ఎస్పీలు సునీల్‌దత్‌, సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ పాల్గొన్నారు.logo