శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 17:42:25

బొట్టు పెట్టి మొక్కలు పంచుతూ..ఆదిలాబాద్ కలెక్టర్ వినూత్న ప్రయత్నం

బొట్టు పెట్టి మొక్కలు పంచుతూ..ఆదిలాబాద్ కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ‘ఇంటింటికి హరిత మహాలక్ష్మి’ పేరిట గ్రామాల్లోని మహిళలకు ఆరు మొక్కల పంపిణీ చేస్తున్నారు. మందారం, కాగితంపూలు, చింత, నిమ్మ, గులాబీ, శ్రీ కృష్ణ తులసి మొక్కలను కలెక్టర్ శుక్రవారం ఇచ్చోడ మండలం ముక్రా కె గ్రామంలోని మహిళలకు బొట్టు పెట్టి పంపిణీ చేశారు. మహిళలు తమ ఇళ్లలో ఈ మొక్కలను మా ఇంటి మహాలక్ష్మి అనే భావనతో నాటి రక్షించాలని కలెక్టర్ సూచించారు.


గ్రామాల్లోని ప్రతి ఇంటిలో మొక్కలు నాటే విధంగా అధికారులు ప్రజలకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సూచించిన విధంగా తాము తమ ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే కుంటామని తెలిపారు.


logo