గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 16:44:08

గ్రీన్‌చాలెంజ్‌ స్వీకరించిన నటి సంధ్యజానక్‌

గ్రీన్‌చాలెంజ్‌ స్వీకరించిన నటి సంధ్యజానక్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. నటి లోరా అమ్ము ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ను నటి సంధ్యజానక్‌ స్వీకరించారు. సంజీవయ్యపార్క్‌లో బుధవారం ఆమె మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమం అపూర్వమైనదని కొనియాడారు.

‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటండి. మరో ముగ్గురికి సవాల్‌ విసరండి. ఇలా హరిత తెలంగాణ కలను సాకారం చేద్దాం.’ అని సంధ్యజానక్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నటులు శరత్‌బాబు, కవిత, కోటేశ్వర్‌రావుకు హరిత సవాల్‌ విసిరారు. 


logo