సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 19:27:04

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు

టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. అభివృద్ధికి ఓటు వేసి, తాము విద్వేషకులం కాదని.. అభివృద్ధి కాముకులమని ప్రజలు నిరూపించారు.

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే డివిజన్‌ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా. కాప్రా, మల్లాపూర్, నాచారం, రామంతా పూర్ డివిజన్ల ప్రజలకు ధన్యవాదాలు. ఓటమిపాలైన డివిజన్‌లపై సమీక్షిస్తాం’ అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.