సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:38:16

బోనాల ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు : మంత్రి అల్లోల

బోనాల ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు : మంత్రి అల్లోల

హైద‌రాబాద్ : బోనాల ఉత్సవాలు నిరాడంబ‌రంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి  దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తల్లుల ఆశీర్వాదంతో ఈ  బోనాలు ప్రశాంతంగా విజయవంతమ‌య్యాయ‌ని,  సహకరించిన భక్తులు,  అధికారులు, సిబ్బంది అందరికీ మంత్రి మంగళవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

 క‌రోనా నుంచి త్వరగా బ‌య‌ట‌ప‌డేలా చూడాల‌ని,  ప్రజలందరిపై  మీ ఆశీర్వాదం ఉండేలా చూడాల‌ని  అమ్మవారిని ప్రార్థించారు. బోనాల వేడుక‌ల‌ను  ప్రతిసారి అంగ‌రంగ వైభ‌‌వంగా నిర్వహించేవారమని కరోనా నేపథ్యంలో  బోనాలు సంద‌డి లేకుండానే జ‌రిగాయ‌న్నారు. ఆల‌య పూజారులు, సిబ్బంది మాత్రమే అమ్మవార్లకు బోనం స‌మ‌ర్పించి, పూజ‌లు నిర్వహించారని వెల్లడించారు. భ‌క్తులు కూడా ఇండ్లలోనే బోనం స‌మ‌ర్పించి పూర్తిగా స‌హ క‌రించార‌న్నారు.logo