శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 21:49:01

ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు : హ‌రీశ్‌రావు

ప్ర‌తి ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు : హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : త‌న‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి హ‌రీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న స్పందిస్తూ.. మీ ప్రేమే త‌న‌కు అసలైన వైధ్యం అన్నారు. దయచేసి త‌న‌కెవ‌రూ ఫోన్ చేయడానికీగానీ త‌న‌ను కలుసుకోవడానికీగానీ ప్ర‌య‌త్నించొద్ద‌ని కోరారు. త‌న ఆరోగ్యానికి సంబంధించిన విశేషాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్విటర్ ద్వారా షేర్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 

రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోవిడ్‌-19 భారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారంతా ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా సూచించారు. 


logo