గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 15, 2020 , 17:26:46

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి: చలివాగులో చిక్కుకున్న పదిమంది రైతులను కాపాడేందుకు హెలిక్యాప్లర్లు పంపించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాల‌ప‌ల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందన్‌పల్లి గ్రామంలోని చలి వాగులో చిక్కుకున్న పది మంది రైతులను రెండు హెలికాప్టర్లలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం ప‌ట్ల  మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను, ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి కలిసి ఐటీ మంత్రి కేటీఆర్‌కు పరిస్థితిని వివరించగానే ఆయన సహాయకచర్యలకు ఆదేశించారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సైతం తనకు ఫోన్ చేసి, ఈ విష‌య‌మై స‌మ‌న్వ‌యం చేయ‌మ‌ని ఆదేశించారని తెలిపారు. తాను , ఎమ్మెల్యే, అబ్దుల్ అజీం, అదనపు ఎస్పీ శ్రీనివాసుతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. 

వ్య‌వ‌సాయ ప‌నుల నిమిత్తం చ‌లివాగు ఆవ‌ల‌వైపున‌కు వెళ్లిన రైతులు ప‌నులు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా, వాగు ఉధృతి పెరిగిందని, దీంతో వారు వాగు ఆవ‌ల‌నే ఉండిపోయారని మంత్రి తెలిపారు. ఆందోళ‌న చెందిన బాధిత కుటుంబాల సభ్యులు తమకు సమాచారమిచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ చొర‌వ చూప‌డం, ఎమ్మెల్యే గండ్ర‌, క‌లెక్ట‌ర్, ఎస్పీలు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌డంతో ఆ ప‌ది మందిని ర‌క్షించ‌గ‌లిగామన్నారు. ప‌ది మంది రైతుల‌ను ర‌క్షించిన రెస్క్యూటీంను అభినందిస్తున్నట్లు చెప్పారు.  తుఫాన్ మ‌రో రెండు మూడు రోజులు కొన‌సాగ‌నున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావడం మంచిదన్నారు. రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ మూడు నాలుగు రోజులపాటు పొలం, చెల‌క ప‌నుల‌ను వాయిదా వేసుకోవాలని సూచించారు. అధికారులు తుఫాన్ త‌గ్గే వ‌ర‌కు ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూనే ఉండాలని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన అన్ని స‌మ‌యాల్లోనూ తాను అధికారులు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటానని చెప్పారు.


logo