సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 20:42:24

ఎస్సీలకు అధిక నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు: మంత్రి కొప్పుల

ఎస్సీలకు అధిక నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌: ఇవాళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభలో 2020-21 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ర్టాభివృద్ధికై మొత్తం రూ. 1,82,914 కోట్ల బడ్జెట్‌ కేటాయించిన ప్రభుత్వం.. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 16,534.97కోట్లు కేటాయించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఎస్సీల ప్రగతికి బడ్జెట్‌లో ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించలేదు. కాగా, ఎస్సీల ప్రగతికి బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు గాను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఉన్నారు.


logo