ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 17:25:09

సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తంగడపల్లి వాసి

సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తంగడపల్లి వాసి

యాదాద్రి భువనగిరి : ఐఎఫ్ఎస్ ఫలితాల్లో చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామ వాసి సత్తా చాటాడు. గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్  ఐఏఎస్ ఫలితాల్లో 218 ర్యాంక్ సాధించాడు. తంగడపల్లికి చెందిన బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడు సత్య ప్రకాష్ గౌడ్. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. ఏడవ తరగతి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫెన్స్ పాఠశాలలో చదువుకున్నాడు. ప్రైవేట్ పాఠశాలలో 8,9,10 తరగతులను హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్ లో చదివాడు. ఇంటర్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. 

ఐఐటీ పాట్నాలో తన బీ.టెక్ ను 2018 లో పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్ పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసి మొదటి సారే 218 రాంక్ కైవసం చేసుకొని ఐపీఎస్ అధికారిగాగా ఎన్నిక కానున్నాడు .ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ..ఐపీఎస్ సాధించి మహిళలు ,చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తానని తెలిపారు.


logo