గురువారం 16 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 01:43:33

పూర్తి వేతనానికి టీజీవో తీర్మానం

పూర్తి వేతనానికి టీజీవో తీర్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని, గత మూడునెలలకు సంబంధించిన సగం వేతనాన్ని కూడా విడుదలచేయాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పదవీ విరమణ వయసును పెంచుతూ ఉత్తర్వులు జారీచేయాలని, టీఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అడ్డంకులు తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో టీజీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, అధ్యక్షురాలు మమత, గెజిటెడ్‌ అధికారుల శాఖల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. టీజీవో నిర్ణయాలకు మద్దతిస్తామని సమావేశానికి హాజరైన గ్రూప్‌-1 అధికారుల సంఘం ప్రతినిధులు హన్మంత్‌నాయక్‌, అలోక్‌కుమార్‌ తెలిపారు.


logo