బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 06:50:30

ఇవాళ టీజీసెట్‌.. ప‌రీక్ష‌కు ఏర్పాట్లు పూర్తి‌‌

ఇవాళ టీజీసెట్‌.. ప‌రీక్ష‌కు ఏర్పాట్లు పూర్తి‌‌

‌హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే టీజీసెట్ ఇవాళ జ‌రుగ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప్ర‌వేశ‌ప‌రీక్షను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌కోసం 1,48,168 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 12న జ‌ర‌గాల్సిన టీజీసెట్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌వేశ‌ప‌రీక్ష కోసం అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు ఈ పరీక్ష ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఎవరినీ హాలులోకి అనుమతించేదిలేద‌‌ని స్పష్టంచేశారు.