బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 11:16:45

మాడ్గి చెక్‌పోస్ట్‌ వద్ద మస్కట్‌ నుంచి వ్యక్తులకు పరీక్షలు

మాడ్గి చెక్‌పోస్ట్‌ వద్ద మస్కట్‌ నుంచి వ్యక్తులకు పరీక్షలు

సంగారెడ్డి : జిల్లాలోని మాడ్గి చెక్‌పోస్ట్‌ వద్ద ఓ ట్రావెల్‌ బస్సును అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల మస్కట్‌ నుంచి ముంబయికి వచ్చిన 37 మంది వ్యక్తులు అక్కడి నుంచి సంగారెడ్డికి బస్సులో వస్తున్నారు. ఎవరికి సమాచారం లేకుండా చెక్‌పోస్టుల నుంచి తప్పించుకుని ఇలా బస్సులో వస్తున్నట్లు గుర్తించిన జిల్లా అధికారులు బస్సును మాడ్గి చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు. జిల్లాలోకి రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరందరికీ వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.logo