నిధులు విడుదలచేయండి మంత్రి హరీశ్‌రావుకు ట్రెసా ప్రతినిధుల వినతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తాసిల్దార్ల వెహికిల్ అలవెన్స్, నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదలచేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తిచేశారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంత్రిని ట్రెసా నేతలు కలిశారు. ఈ ఏడాది మార్చిలో ల్యాప్స్ అయిన నిధులతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న బడ్జెట్‌ను విడుదలచేయాలని కోరారు. అంతకుముందు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కలిసిన ట్రెసా నాయకులు.. నూతన రెవెన్యూ చట్టం నేపథ్యంలో సిబ్బంది సంఖ్య పెంచాలని, కొత్త బాధ్యతలకు అనుగుణంగా వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమాల్లో ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు రియాజుద్దీన్, కార్యదర్శులు రాంరెడ్డి, పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్