బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 06:50:28

త్వరలోనే టెన్త్‌ ఒరిజినల్‌ మెమోలు

త్వరలోనే టెన్త్‌ ఒరిజినల్‌ మెమోలు

  • అక్షరదోషాల సవరణకు అవకాశం

హైదరాబాద్ : రాష్ట్రంలో పదోతరగతి పాసైన విద్యార్థులందరికీ త్వరలోనే ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పంపించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు. మెమోల పంపిణీ కంటే ముందు విద్యార్థుల పేరు, పుట్టిన రోజు ఇతర వివరాలకు సంబంధించిన తప్పులు, అక్షరదోషాలు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇందుకు మరో వారంరోజుల వరకు అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత స్కూళ్లవారీగా ఒరిజినల్‌ మార్కుల మెమోలు పంపిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.


logo