శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 13:20:03

జూన్‌ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు!

జూన్‌ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు!

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో మార్చి 23న లాక్‌డౌన్‌ విధించిన విషయం విదితమే. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో కేవలం తెలుగు, హిందీ పరీక్షలు మాత్రమే జరిగాయి. మిగతా పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. అయితే పది పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. జూన్‌ 8 తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని  సూచించింది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3వ తేదీన సమీక్ష నిర్వహించి, 4న నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. 


logo