శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 20:52:40

ఇంటినుంచే పది మూల్యాంకనం?

ఇంటినుంచే పది మూల్యాంకనం?

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. మూల్యాంకనాన్ని ఏదో ఒక సెంటర్‌లో నిర్వహించడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి సమస్యలు ఉంటున్నందున.. ఉపాధ్యాయుల ఇంటి నుంచే జరిపేలా ఏర్పాట్లుచేయాలని భావిస్తున్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనం ఉపాధ్యాయులు ఇంటినుంచే నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కూడా ఇదే విధానం అమలుచేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఈ నెల 19న హైకోర్టు నిర్ణయం తీసుకోనున్నది. ఆ వెంటనే పరీక్షల టైంటేబుల్‌ విడుదలచేసి రెండువారాల్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటినుంచి మూల్యాంకనం చేయటమే మంచిదని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాచారి తెలిపారు.


logo