మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:31

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టెండర్లు

  • ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టెండర్లు పిలుస్తున్నామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అప్పటి పరిస్థితుల మేరకు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 91 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందన్న ఆయన, తిరుమల దర్శనానికి వచ్చి కరోనా పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు. 


logo