గురువారం 28 జనవరి 2021
Telangana - May 29, 2020 , 01:38:29

న్యాయవాది ఖాతాలోకి పదివేలు

న్యాయవాది ఖాతాలోకి పదివేలు

  • 14,166 మంది న్యాయవాదులకు లబ్ధి
  • ఆన్‌లైన్‌ ద్వారా జమచేసిన సీజే 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న న్యాయవాదుల కోసం సీఎం కేసీఆర్‌ రూ.25 కోట్లు కేటాయించారు. అందులో రూ.15 కోట్లను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ నిధులనుంచి అర్హులైన ఒక్కో న్యాయవాదికి రూ.10 వేలు, అడ్వకేట్‌ క్లర్కులకు రూ.5 వేలు అందజేయాలని వెల్ఫేర్‌ట్రస్ట్‌ నిర్ణయించింది. 14,166 మంది న్యాయవాదులకు, 1,029 మంది క్లర్కులకు నగదు జమచేశారు. ఆన్‌లైన్‌ ద్వారా నగదు జమచేసే ఈ కార్యక్రమాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ గురువారం సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్‌ అకాడమిలో ప్రారంభించారు. మరో 2 వేల దరఖాస్తులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. 

పూర్తిసమాచారం సేకరించి వారిక్కూడా అందజేయనున్నట్టు అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఏ నర్సింహారెడ్డి, అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రిజిస్ట్రార్లు, జ్యుడీషియల్‌ అకాడమి డైరెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. నిధుల జమపై హైకోర్టు అడ్వకేట్‌ క్లర్కుల సంఘం అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఆఫీస్‌బేరర్లు సమ్మరాజు పద్మనాభం, అనంతయ్య హర్షం వ్యక్తంచేశారు.


logo