మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:31

ప్రతి ఒక్కరికి పది కిలోల బియ్యం

ప్రతి ఒక్కరికి పది కిలోల బియ్యం

  •  నేటి నుంచి పంపిణీకి శ్రీకారం.. 
  • నవంబర్‌ వరకు కొనసాగింపు
  • కేంద్రం ఇచ్చే బియ్యానికి ఇది అదనం 
  • 2.80కోట్లమంది పేదలకు లబ్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కల్లోలం నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి పది కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీచేయాలని నిర్ణయించింది. ఈ నెల నుంచి నవంబర్‌వరకు ఈ ఉచిత పంపిణీ కొనసాగుతుందని శనివారం పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌  కరీంనగర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 53.30 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 1.91 కోట్ల మందికి మాత్రమే ఉచితబియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

కానీ రాష్ట్రంలోని 87.54 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని.. దీంతో మొత్తం 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరనున్నదని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.216 కోట్లు ఖర్చుచేస్తూ 1.79 కోట్ల టన్నుల బియ్యం పంపిణీచేస్తున్నదని, ఇప్పుడు ఐదు నెలలపాటు ఉచిత బియ్యం కలుపుకొని 2.89 కోట్ల టన్నులు పంపిణీచేస్తామని వివరించానరు. ఇందుకోసం ప్రతి నెలా రూ.50 కోట్ల చొప్పున ఐదు నెలలకు రూ.250 కోట్లు అదనంగా వెచ్చించినట్లు వెల్లడించారు. 
logo