శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 18:24:10

ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు

ద.మ. రైల్వేలో తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలు

హైదరాబాద్‌ : కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్‌ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్‌ అటెండెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెంట్రల్‌ హాస్పిటల్‌, లాలాగూడ, సికింద్రాబాద్‌ రైల్వే ఆస్పత్రుల్లో సేవల కోసం ఈ నియామకాలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులు www.scr.indianrailways.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 15 వరకు విధించారు. వీడియో కాల్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం చేపట్టనున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ 9701370624. 


logo