బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 01:28:36

అంతర్జాతీయస్థాయిలో ‘టెంపుల్స్‌ ఆఫ్‌ తెలంగాణ’

అంతర్జాతీయస్థాయిలో ‘టెంపుల్స్‌ ఆఫ్‌ తెలంగాణ’
  • పుస్తకం రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హెరిటేజ్‌ తెలంగాణశాఖ ఆధ్వర్యంలో‘ టెంపుల్స్‌ ఆఫ్‌ తెలంగాణ పుస్తకాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీసుకురావాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. హెరిటేజ్‌ తెలంగాణశాఖపై బుధవారం సమీ క్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. బుద్ధిస్ట్‌ విజ్ఞానకేంద్రం, ఫణిగిరిపై ప్రత్యేకంగా సావనీర్‌ను రూపొందించాలని చెప్పారు. చారిత్రక, వారసత్వ ప్రాంతాల్లో కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పర్యాటకప్రాంతాలతోపాటు టూరిజం బస్సు లు, బోటింగ్‌ ప్రదేశాలు, హరిత హోటళ్లు, సమాచార కేంద్రాల వద్ద కరపత్రాలతో అవగాహన కల్పిస్తామని చెప్పారు. మరో కార్యక్రమంలో సెట్విన్‌ సంస్థ కొత్తగా రూపొందించిన కోర్సుల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


logo