శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 12:50:14

దేవాలయాలు మూత

దేవాలయాలు మూత

  • ఈ నెల 31 వరకు అన్ని సేవలు రద్దు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆలయాలను మూసివేయగా, శుక్రవారం మరికొన్నింటిని బంద్‌చేశారు. బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సేవలు ఈ నెల 31 వరకు రద్దుచేశారు. వందేండ్ల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలడంతో మూడు నెలలు, కలరా వ్యాధితో 1978లో నెలపాటు మూసివేసిన రాజన్న ఆలయం.. ఇప్పుడు మళ్లీ బంద్‌ అయింది. 


కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని కూడా మూసివేశారు. భద్రాచలం రామాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, అలంపూర్‌లోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, దట్టమైన నల్లమలలో వెలసిన ఉమా మహేశ్వరం ఆలయం,  ఏడుపాయల వనదుర్గాభవాని, మట్టపల్లిలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో, ములుగు జిల్లాలోని రామప్ప, మల్లూరు ఆలయాలు, మేడారం జాతరలో దర్శనాలు నిలిపివేశారు. ఏపీలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, శ్రీశైలం సహా ప్రధాన ఆలయాలను బంద్‌చేశారు. శనివారం నుంచి ఈ నెల 31 వరకు మెదక్‌ కెథడ్రల్‌ చర్చి మూసివేయనున్నారు.  యాదాద్రి ఆలయంలో  భక్తుల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.logo