శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:27

ఆలయాల్లో ఆర్జిత సేవలు ప్రారంభం

ఆలయాల్లో ఆర్జిత సేవలు ప్రారంభం

  • దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి
  • దేవుడికి లాక్‌డౌన్‌ ఎత్తివేత!

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా అన్నిఆలయాల్లో ఆదివారం నుంచి ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్‌ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతికదూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూజలుచేసేందుకు అనుమతించాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దేవాదాయశాఖ హైదరాబాద్‌ విభాగం పరిధిలోని పలు ఆలయాల్లో ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ శాఖ కమిషనర్‌ వీ అనిల్‌కుమార్‌ తెలిపారు. మరికొన్ని ఆలయాల పరిస్థితులు, స్థానికంగా కరోనా వ్యాప్తి పరిస్థితులను బట్టి విడుతలవారీగా సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారికంగా తెలిసింది.logo