Telangana
- Jan 27, 2021 , 07:43:47
VIDEOS
రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ : రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశనుంచి వీస్తున్న గాలుల వల్ల పొడి వాతావరణం ఏర్పడింది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ర్టంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.9 నుంచి 21.8 డిగ్రీల వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా దోనూర్, వికారాబాద్‌లో అత్యల్పంగా 13.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అత్యధికంగా 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది. మూడురోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17 డిగ్రీల వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది.
తాజావార్తలు
MOST READ
TRENDING