ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 07:52:44

రాష్ర్టంలో క్ర‌మంగా వేడెక్కుతున్న వాతావ‌ర‌ణం

రాష్ర్టంలో క్ర‌మంగా వేడెక్కుతున్న వాతావ‌ర‌ణం

హైద‌రా‌బాద్‌, జన‌వరి 21 (న‌మస్తే తెలం‌గాణ): రాష్ట్రంలో వాతా‌వ‌రణం క్రమంగా వేడె‌క్కు‌తు‌న్నది. చాలా ప్రాంతాల్లో పగటి పూట 33 నుంచి 34 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు నమో‌ద‌వు‌తు‌న్నాయి. పగటి పూట ఉష్ణో‌గ్ర‌తలు పెరు‌గు‌తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం డైరె‌క్టర్‌ డాక్టర్‌ నాగ‌రత్న తెలి‌పారు. గురు‌వారం మెద‌క్‌లో అత్య‌ల్పంగా 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దు‌కాగా, భద్రా‌చ‌లంలో 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికా‌ర్డ‌యిం‌దని చెప్పారు. మరో‌వైపు, ఉదయం వేళల్లో చలి‌తీ‌వ్రత ఇంకా కొన‌సా‌గు‌తు‌న్నది. ప్రధా‌నంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తు‌న్నాయి. రాగల మూడ్రో‌జుల వరకు రాష్ట్ర‌వ్యా‌ప్తంగా పొడి వాతా‌వ‌రణం ఉంటుంది. శుక్ర, శని‌వా‌రాల్లో పలు‌చోట్ల ఉదయం వేళల్లో పొగ‌మంచు ఏర్ప‌డు‌తుం‌దని అధి‌కా‌రులు తెలి‌పారు. మరో‌వైపు, హైద‌రా‌బా‌ద్‌లో పగటి ఉష్ణో‌గ్ర‌తలు పెరిగి ప్రజలు కొంత ఉక్క‌పో‌తకు గుర‌వు‌తు‌న్నారు.

VIDEOS

logo