బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 16:59:14

రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

హైదరాబాద్ : వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు ఈదురుగాలులు వీస్తుండడంతో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, రెండు రోజులుగా గాలిలో తేమ తగ్గి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణం కంటే 5డిగ్రీలు ఎక్కువ  ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.


logo