బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 15:30:43

రాగ‌ల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు

రాగ‌ల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు

హైద‌రాబాద్ : రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి ఎండ‌లు దంచికొడుతున్న విష‌యం విదిత‌మే. వేస‌వి కాలం మాదిరి ప‌గ‌లు, రాత్రి ఉక్క‌పోత పోస్తుంది. గాలిలో తేమ శాతం త‌గ్గ‌డం వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. సాధార‌ణం క‌న్నా 2.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. గ‌త రెండు రోజుల్లో న‌ల్ల‌గొండ‌లో 35.5 డిగ్రీలు, ఖ‌మ్మంలో 33.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo