సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 28, 2021 , 06:22:40

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు

హైదరాబాద్ : తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32-34 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా.. వికారాబాద్‌ జిల్లా కోటిపల్లిలో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతోపాటు రాత్రి వేళల్లో చలి తీవ్రత తగ్గింది. బుధవారం నగరంలో 31.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

VIDEOS

logo