మంగళవారం 07 జూలై 2020
Telangana - Feb 25, 2020 , 00:31:29

మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు
  • హైదరాబాద్‌లో 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ / హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎండ లు ముదురుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీలు పెరిగి 34.7 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో మూడ్రోజుల వరకు ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో నమోదయ్యే అవకాశాలున్నట్టు చెప్పారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీనిప్రభావం రాష్ట్రంపై ఉండదని అధికారులు తెలిపారు. తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 


logo