శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 25, 2020 , 16:35:16

రాజస్థాన్‌లో ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులు

రాజస్థాన్‌లో ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో రాజస్థాన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నీట్‌, ఐఐటీ కోచింగ్‌కు వెళ్లి వివిధ వసతి గృహాల్లో విద్యార్థులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 200 మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌తో హాస్టళ్లు మూసివేశారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని అంటున్నారని  వాపోయారు. బిస్కెట్లు తిని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో కరోనా కేసులతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. కొన్ని రాష్ర్టాలు తమ విద్యార్థులను తిసుకువెళ్లాయి. సొంతూర్లకు తీసుకువెళ్తామని కొందరు డబ్బులు తీసుకుని మోసం చేశారు. తమను సొంత రాష్ర్టాలకు తరలించాలని సీఎంలు కేసీఆర్‌, జగన్‌లకు విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలను వీడియో రూపంలో సీఎంలకు పంపారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


logo