గురువారం 16 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:27:56

39 టీఎంసీలు అదనంగా వాడిన ఏపీ

 39 టీఎంసీలు అదనంగా వాడిన ఏపీ

  • కృష్ణాబోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 2019-20 నీటిసంవత్సరంలో కృష్ణా బేసిన్‌వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ తన కోటాకంటే అదనంగా 39 టీఎంసీలు వాడుకున్నదని తెలంగాణ నీటిపారుదలశాఖ కృష్ణాబోర్డుకు స్పష్టంచేసింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్‌రావు లేఖ రాశారు. నీటి సంవత్సరం వినియోగ లెక్కలను నిర్ధారించేముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సంబంధించిన వివరాలను పట్టికరూపంలో బోర్డుకు పంపించారు. 

2019-20లో రెండురాష్ర్టాల నీటి వినియోగం  (అంకెలు టీఎంసీల్లో)

ప్రాజెక్టులు తెలంగాణ ఏపీ

శ్రీశైలం, సాగర్‌ నుంచి 205.517 573.727

ఇతర భారీ ప్రాజెక్టులు 63.213 78.433

మధ్యతరహా ప్రాజెక్టులు 9.416 1.454

మొత్తం 278.146 653.614

34:66 ప్రకారం 316.718 614.962

మిగులు/ అదనం -38.562 +38.562logo