సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:16:33

కశ్మీర్‌లో చలితీవ్రతకు తెలుగు జవాన్‌ మృతి

కశ్మీర్‌లో చలితీవ్రతకు తెలుగు జవాన్‌ మృతి

  • చిత్తూరు జిల్లాలో విషాదం 

హైదరాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కశ్మీర్‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్‌ ఒకరు చలితీవ్రతతో  మృతిచెందారు. 14 ఏండ్లుగా భారతసైన్యంలో జవానుగా విధులు నిర్వహిస్తున్న చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు (38) శనివారం చలితీవ్రతకు కుప్పకూలిపోయాడు. సహచర జవాన్లు వెంటనే అతడిని ఆర్మీ దవాఖానకు తరలించారు. అప్పటికే రెడ్డప్పనాయుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత విషయాన్ని రెడ్డప్ప కుటుంబానికి ఆర్మీ అధికారులు తెలియజేశారు. ఆ సమాచారం తెలిసి రెడ్డప్ప కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న రెడ్డప్ప శనివారం మధ్యాహ్నమే తన భార్య, పిల్లలతో ఫోన్‌లో   మాట్లాడారు. అంతలోనే ఈ విషాద వార్త వినడంతో ఆయన కుటుంబం తల్లడిల్లిపోయింది.