సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 06:36:57

యజ్ఞంలా ‘వారం వారం తెలుగు హారం’

యజ్ఞంలా ‘వారం వారం తెలుగు హారం’

హైదరాబాద్‌: ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు, సాహితీవేత్త వెంకటేశ్వర్‌ రావు ‘వారం వారం తెలుగు హారం’ అనే ప్రత్యేక కార్యక్రమం ఆదివారం 100వ ఎపీసోడ్‌కు చేరుకుంది. ఈ సమావేశానికి సంబంధించిన కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, తదితరులు విచ్చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు, సాహితీవేత్త ఆర్‌.దిలీప్‌రెడ్డి, ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు, సాహితీవేత్త వెంకటేశ్వర్‌ రావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్‌ ఆచార్య గౌరీ శంకర్‌, ప్రముఖ సాహితీవేత్తలు సన్నిధానం నర్సింహశర్మ, కాలువ మల్లయ్య పాల్గొన్నారు.  


logo