బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 17:52:43

జూన్‌లో సినిమా షూటింగ్స్‌ ప్రారంభం

జూన్‌లో సినిమా షూటింగ్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సినీరంగ ప్రతినిధులు సమావేశమయ్యారు. షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్‌ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించారు. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని సీఎంను సినీరంగ ప్రతినిధులు కోరారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని సీఎం అన్నారు. జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్‌లు, రీప్రొడక్షన్లు దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు, కొవిడ్‌ నివారణ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్‌.. సినీ పెద్దలకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు, దిల్‌ రాజు, రాజమౌళి, సి. కల్యాణ్‌, ఎన్‌. శంకర్‌, కొరటాల శివతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


logo