ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 20:00:40

తెలుగు అకాడమి క్యాలెండర్‌ ఆవిష్కరణ

తెలుగు అకాడమి క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగు అకాడమి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు.  తెలుగు అకాడమి కార్యాలయంలో అకాడమి సంచాలకుల చేతుల మీదుగా క్యాలెండర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బి. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. అకాడమి అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కె. సదన్‌తేజ్‌, కార్యదర్శి ఎస్‌. బాబురెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్‌.శ్యాంసుందర్‌, కోశాధికారి ఎన్‌.శ్రీనాథ్‌, సభ్యులు, అకాడమి ఉద్యోగులు పాల్గొన్నారు. 


logo