హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష రంగంలో అవకాశాలను ఒడిసిపట్టి, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో తెలంగాణ ముందుండేందుకు అడుగులు వేస్తున్నది. స్పేస్ టెక్నాలజీలో తెలంగాణను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో పరిశ్రమ, నిపుణులతో చర్చించి రూపొందించిన ముసాయిదాను ఐటీశాఖ గురువారం విడుదల చేసింది. ఈ నెల 25లోగా సలహాలు, సూచనలు పంపించాలని ఔత్సాహికులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా అనంత్ టెక్నాలజీస్, వెమ్ టెక్నాలజీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ వంటి స్పేస్ టెక్ కంపెనీలు, ైస్కెరూట్, ధ్రువ వంటి స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. డీఆర్డీవో, ఎన్ఆర్ఎస్సీ, ఏడీఆర్ఐఎన్, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఎండీఎన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డీఎంఆర్ఎల్, ఏఆర్‌సీఐ వంటి ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో ఉండి స్పేస్ టెక్నాలజీ ఎకోసిస్టంను బలోపేతం చేస్తున్నాయి.
స్పేస్టెక్లో తెలంగాణ ముద్ర
స్పేస్టెక్లో తనదైన ముద్ర వేసుకున్న తెలంగాణ మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు సంబంధించిన 30 శాతం భాగాలను ఇక్కడి నుంచే అందించింది. నేషనల్ పాలసీలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నది. స్పేస్ టెక్ రంగం వృద్ధి పథంలో తెలంగాణ ముఖ్య భూమిక పోషించనున్నది. అనుకున్న లక్ష్యాలను చేరేందుకువీలుగా ముసాయిదా రూపకల్పన జరిగింది.
జయేశ్‌రంజన్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి
స్పేస్ టెక్ పాలసీలో పేర్కొన్న దాని ప్రకారం.. అంతరిక్ష రంగంలో ఏర్పరుచుకున్న లక్ష్యాల సాధనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. ఇది కంపెనీలు, స్టార్టప్స్‌కు సెంట్రల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. పాలసీని అమలుచేసే బాధ్యత తీసుకుంటుంది. దీనికి టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్, టీఎస్ఐసీ, రీచ్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మౌలిక సదుపాయాల వెసులుబాటులో భాగంగా.. ప్రొక్యూర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మెటీరియల్స్, పీపీపీ, ఎంఎస్ఎంఈలతో అనుబంధం, టెస్టింగ్ వసతులను పంచుకోవడం, భూముల కేటాయింపు, డాటా యాక్సెస్ సౌకర్యం, కమర్షియల్ గ్రౌండ్ స్టేషన్స్, ఆర్అండ్డీ ల్యాబ్స్ పంచుకోవడం వంటి అంశాల్లో పాలసీ తోడ్పాటునందిస్తుంది. బిజినెస్ ఫెసిలిటేషన్ అండ్ కొలబరేషన్‌లో భాగంగా స్టార్టప్స్‌కు పెట్టుబడి సాయం, ఇన్సెంటివ్, భాగస్వామ్యం, ఇన్సూరెన్స్ అండ్ ఫండింగ్పై వర్క్‌షాప్స్ నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, లీగల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సలహాలు, కోవర్కింగ్ స్పేస్, ప్రభుత్వ పథకాల అమలు తదితర విషయాల్లో మద్దతు అందిస్తుంది.