గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:28:26

మాతామాణికేశ్వరి శివైక్యం

మాతామాణికేశ్వరి శివైక్యం
  • మూడు రోజులపాటు భక్తుల దర్శనార్థం పార్థివదేహం

దామరగిద్ద: మహాయోగిని, మాతా మాణికేశ్వరి(86) శివైక్యం చెందారు. శనివారం రాత్రి 8.51 గంటలకు కర్ణాటకలోని గుల్బ ర్గా జిల్లా సేడం తాలూకా యానగుంది సూర్యనంది క్షేత్ర ఆశ్రమంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం 10 గంటలనుంచి మూడు రోజులపాటు ఆమె పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆశ్రమం లో ఉంచుతారు. మాతా ఇకలేరన్న విషయం తెలుసుకున్న భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


75 ఏండ్లుగా ఆహారం తీసుకోకుండా..

అహింస పరమో ధర్మమే లక్ష్యంగా బోధనలు గావిస్తూ ప్రజలకు చేరువైన మాతామాణికేశ్వరి కర్ణాటకలోని సేడం తాలూకా మల్హాబాద్‌లో ఆశమ్మ, బుగ్గప్పలకు 26 జూలై 1934లో జన్మించారు. వీరిది పేద కుటుంబం కావడంతో మాణిక్యమ్మను పశువులను మేపేందుకు పంపేవారు. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేసినా సంసారిక జీవితానికి దూరంగా ఉంటూ వచ్చా రు. మల్హాబాద్‌ పక్కనే ఉన్న ఏకాంబరి గుట్టల ప్రాంతంలో మేకలను కాస్తూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యా నంలో ఉండేవారు. యానగుంది రాందేవుడి గుడిలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత అదే గుట్టపై ఆశ్రమాన్ని స్థాపించారు. సిద్ధేశ్వరాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలను నిర్మించారు.


 యానగుందికి వచ్చిన కొత్తలో పశుపక్ష్యాదులతో కలిసి చెట్లపై ఉండేవారని, యానగుందిలో మాయమై శ్రీశైల మహాక్షేత్రం లో ప్రత్యక్షమయ్యేవారని స్థానికులు తెలిపారు. యానగుందిలో ఆమె నీటితో దీపాలు వెలిగించేవారని, 75ఏండ్లుగా ఆహారం తీసుకోకుండా ఉంటున్నారని భక్తులు చెబుతుంటారు. యానగుంది గుట్టపై ఆశ్రమం ఆధ్వర్యంలో  నిరుపేద విద్యార్థుల కోసం విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఏటా శివరాత్రికి, గురుపూజోత్సవం రోజు భక్తులకు దర్శనం ఇచ్చేవారు. ఆమె భక్తు లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేసి మాణికేశ్వరి ప్రవచనాలు, అహింసపై ప్రజలకు వివరిస్తున్నారు. ఆమె చివరి సారిగా గత నెల 21న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చారు. 


logo
>>>>>>