బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 17:59:51

తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు

తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు

హైద‌రాబాద్ : దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ  సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీ కేశ‌వులు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విత్తన ధృవీకరణలో నూతన సంస్కరణలతో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో నంబర్ వన్ గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను  కలిగిఉండి విత్తన దృవీకరణలో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. దీనిపై రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ‌ను ప్ర‌పంచ విత్త‌న భాండాగారం దిశ‌గా ప్రోత్స‌హించ‌డానికి కావాల్సిన అన్ని ర‌కాల చ‌ర్య‌లు చేప‌డుతూ ముందుకు పోవాల‌ని ఆకాంక్షించారు. విత్త‌న ధృవీకరణ సంస్థ ఎండీకి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. 


logo