శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:01:50

టీసాట్‌'కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

టీసాట్‌'కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీసాట్‌ యాప్‌ 10 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం హర్షణీయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.  ఈ సందర్భంగా బుధవారం మంత్రి కేటీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌,  టీసాట్‌ సీఈవో శైలేశ్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ కలిశారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేసినందుకు గాను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కొవిడ్‌ ప్రభావం వల్ల టీసాట్‌ నెట్‌వర్క్‌ విద్యాశాఖకు ప్రత్యామ్నాయంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై సన్‌డైరెక్ట్‌లో విద్య 195, నిపుణ 196 నంబర్‌ చానళ్లలో ప్రసారమవుతాయని తెలిపారు.