శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 17, 2020 , 17:07:57

దేశానికే తెలంగాణ దిశ చూపుతుంది

దేశానికే తెలంగాణ దిశ చూపుతుంది

4 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగిన గోదాముల కెపాసిటీ

త్వరలో 40 లక్షలకు పెరగనున్న గోదాములు

రైతుకే పిల్లనిస్తాననే పరిస్థితి వస్తుంది

పట్టణాల నుంచి పొలాల్లోకి పెరగనున్న వలసలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలతో తెలంగాణాలో పరిస్థితులు మారుతున్నాయన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. కేసీఆర్‌ కృషితోనే 24 గంటలు నాణ్యమైన కరంటు సాద్యమైందన్నారు. గతంలోలా రైతులు విత్తనాల కోసం తండ్లాడే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఎరువుల కోసం ఎదురుచూసే దుస్థితి తప్పిందన్నారు మంత్రి. రైతులు తమ పంటలను గత సర్కారు కాలంలో గోదాములలో దాచుకునే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ సర్కార్‌ గోదాములను 4 లక్షల కెపాసిటీ నుండి 24 లక్షలకు పెంచిందని తెలిపారు. ఇప్పుడు దాన్ని అదనంగ మరో 40 లక్షల కెపాసిటీకి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు వరి మాత్రమే కొనుగోలు చేశారని, అన్ని పంటలకు అవకాశం ఉండేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని పంటలు వంద శాతం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. దళారులు, వ్యాపారుల మీద ఆధారపడకుండా తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడిందన్నారు మంత్రి.

గతంలో రైతు మరణిస్తే ఆ కుటుంబం అధోగతి పాలయ్యేది, కానీ ఇప్పుడు ఆ కుటుంబం సొంతకాళ్లపై, ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మహత్య చేసుకునే స్థితి నుండి ధైర్యంగా ముందుకుసాగే భరోస ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయ శాఖలో 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. పట్టణాల నుండి ప్రజలను వ్యవసాయం వైపు, వలసలను గ్రామాల వైపు మళ్లిండం తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమయిందన్నారు మంత్రి. రైతుకు పిల్లనియ్యనన్న పరిస్థితి నుండి .. రైతుకే పిల్లనిస్తమన్న అలోచనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఆరేళ్లలో వ్యవసాయం దండగ అనే మాట నుంచి పండగ అనే స్తితికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. సాంప్రదాయ పంటలొద్దు .. రైతుల అలోచనలు మార్చండని అధికారులకు మంత్రి సూచించారు. రైతులు వారికి లాభమయ్యే పంటలే సాగు చెయ్యాలని సూచించారు.  మార్కెట్ల పరిస్థితి, దేశంలోని వివిధ రాష్ర్టాలలో అవసరాలు అధికారులు ఆధ్యయనం చేయాలన్నారు.


logo