తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

సంగారెడ్డి : పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం 112 ఆర్సీపురం డివిజన్లోని రామచంద్రారెడ్డినగర్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పానగేశ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయణిస్తుందని తెలిపారు.
దేశంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ తలసరి ఆదాయంలో 16శాతం గ్రోత్‌రేట్‌తో ముందుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు రాష్ర్టాభివృద్ధి, పేదల సంక్షేమానికి మేలు చేస్తున్నాయని అన్నారు. గత అరువై ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఆరేండ్ల కాలంలో చేసి చూపించామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట ఉన్నాయని ప్రజలు బాగా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
రాష్ట్ర అభివృద్ధికి నిధులివ్వకుండా కేంద్రం అడుగడుగునా వివక్ష చూపిస్తుందని మంత్రి అన్నారు. మత రాజకీయాలు చేసే బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్‌గౌడ్, 112 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పానగేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బెంగాల్ బీజేపీ ఆఫీసులో ఘర్షణ: వాహనాలకు నిప్పు
- అమిత్‌షా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు?!
- 2021లో బైజూస్ కు మార్కెట్ ఎలా ఉందంటే..?
- ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్