బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:25:31

కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కొప్పుల భేటీ

 కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కొప్పుల భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఢిల్లీలో తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేకంగా కలిశారు. సోమవార ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతోపాటు కేంద్ర మంత్రిని కలిశారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 15 రహదారులు, నేషనల్‌ హైవేల నిర్మాణం, ఎన్‌హెచ్‌-63 నిజామాబాద్‌, జగ్దల్‌పూర్‌ 121/800 నుంచి 128/200 వరకు ధర్మపురి నియోజకవర్గంలో (7 కిలోమీటర్ల) ఫోర్‌లైన్‌ మంజూరుచేయాలని కేంద్ర మంత్రికి కొప్పుల ఈశ్వర్‌ వినతిపత్రం సమర్పించారు.  


logo