శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 01:10:23

56 టీఎంసీలు కావాలి

56 టీఎంసీలు కావాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తాగు, సాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి 56 టీఎంసీల జలాలు కావాలని తెలంగాణ జల వనరుల శాఖ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు సోమవారం ఇండెంట్‌ సమర్పించింది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా13 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 12 టీఎంసీలు, మిషన్‌భగీరథ కింద నల్లగొండ తాగునీటి అవసరాలకు 2 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు సాగునీరు కింద 23 టీఎంసీలు కావాలని లేఖలో పేర్కొన్నారు.


logo