బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 15:18:11

ఇది సంక్షేమ సర్కార్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఇది సంక్షేమ సర్కార్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి:  క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్దిదారులకు 11 లక్షల 70,500 చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇబ్బందులున్నా పేదల సంక్షేమంలో రాజీ లేదు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు.  సామాన్యుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. కళ్యాణలక్ష్మి, గురుకులాలు, సన్నబియ్యం అన్నం, ఆసరా ఫించన్లు ఇలా ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి చెప్పారు.


logo