బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 07:10:14

పేద ముస్లింల అంత్యక్రియలకు ఐదువేల సాయం

పేద ముస్లింల అంత్యక్రియలకు ఐదువేల సాయం

హైదరాబాద్: పేద ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.5 వేల సాయం అందించాలని వక్ఫ్‌బోర్డు నిర్ణయించింది. చైర్మన్‌ మహమ్మద్‌ సలీం అధ్యక్షతన శనివారం సమావేశమైన బోర్డు.. మొత్తం 49 అంశాలపై చర్చించింది. గంధంగూడ గ్రామంలో శ్మశానవాటిక సర్వేనంబర్‌ 81లో ఓ ముస్లిం మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్న వీఆర్‌ఏ, తాసిల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై క్రిమినల్‌ కేసు నమోదుచేయాలని కలెక్టర్‌ను కోరింది. శ్మశానవాటికల్లో మృతదేహాల ఖననంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నది. సమావేశంలో బోర్డు సభ్యులు అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేన్‌, మిర్జా అన్వర్‌బేగ్‌, జాకీర్‌ హుస్సేన్‌, జావిద్‌ పాల్గొన్నారు.

హజ్‌ యాత్ర లేనట్టే!

ఈ ఏడాది హజ్‌ యాత్రపై సందిగ్ధత నెలకొందని హజ్‌కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ మసిఉల్లాఖాన్‌ చెప్పారు. యాత్ర రద్దు చేసుకొనేవారికి 100 శాతం డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు.


logo